TSPSC : నిందితురాలు రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉంది: బండి సంజయ్

TSPSC : నిందితురాలు రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉంది: బండి సంజయ్

పేపర్ లీక్ కేసులో తప్పు జరగనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి అభ్యంతరమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు.  పేపర్ లీక్ ఘటనతో  30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు.   అభ్యర్థులంతా రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు.  నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోకుండా లిక్కర్ కేసులో కవితను కాపాడుకోవడానికి మంత్రులంతా ఢిల్లీలో మకాం వేశారని అన్నారు. 

పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇన్నేళ్లు టీఎస్ పీఎస్సీ  కమిషన్ లో పని చేస్తున్నా వాళ్లను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు బండి సంజయ్.  పక్క రాష్ట్రాలను వదిలేసి  ముందు సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో  సరిదిద్దుకోవాలని కేటీఆర్ కు సూచించారు.