బెయిల్ వస్తుందా.. రాదా.. బండి సంజయ్ పై తీవ్ర ఉత్కంఠ

బెయిల్ వస్తుందా.. రాదా.. బండి సంజయ్ పై తీవ్ర ఉత్కంఠ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ వస్తుందా రాదా.. ఏం జరగబోతుంది. బెయిల్ పిటీషన్ పై హనుమకొండ జిల్లా కోర్టులో ఏప్రిల్ 6వ తేదీ గురువారం మధ్యాహ్నం నుంచి తీవ్ర వాదనలు జరుగుతున్నాయి. బెయిల్ ఇవ్వాలని బండి తరపు లాయర్లు గట్టిగా వాదిస్తుంటే.. విచారణ కొనసాగుతుంది బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. 

బెయిల్ ఇవ్వకపోయినా.. బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలనే వాదన వినిపించారు సంజయ్ తరపు లాయర్లు. ఏ ఆదేశాలు ఇచ్చినా.. ఇవ్వాలే ఇవ్వాలని.. వరసగా మూడు రోజులు కోర్టుకు సెలవులు ఉన్నాయని.. బెయిల్ పిటీషన్ వాయిదా మాత్రం వేయొద్దని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్ తరపు న్యాయవాదులు. బెయిల్ పిటీషన్ ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే.. హైకోర్టుకు వెళ్లే అవకాశం కోల్పోతామని బండి సంజయ్ తరపు లాయర్లు వాదిస్తున్నారు.

మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాత్రం.. పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోరుతుంది. విచారణ చేయాల్సింది ఇంకా ఉందని.. ఏ1గా ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయొద్దని వాదించారు. 

రెండు వర్గాల తరపున వాదనలు విన్న జిల్లా కోర్టు.. తీర్పు ఎలా ఇస్తుంది అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్న వాదనలు పూర్తయ్యాయి. జడ్జి తీర్పు కోసం బీజేపీ పార్టీ క్యాడర్ మొత్తం వెయిట్ చేస్తుంది. సండి సంజయ్ కు బెయిల్ వస్తుందా రాదా.. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది వెయిట్ అండ్ సీ..