ముందస్తు ఎన్నికలొస్తే.. పాదయాత్రకు బదులు బస్సు యాత్ర

ముందస్తు ఎన్నికలొస్తే..  పాదయాత్రకు బదులు బస్సు యాత్ర

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్ర నిర్వహించేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. 

రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలొస్తే పాదయాత్రకు బదులు బస్సు యాత్ర నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర నిర్వహించేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర చేపట్టి.. 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నామని  ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ ఛార్జ్ మనోహర్ రెడ్డి తెలిపారు.