
తాను ఎవరిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మార్చి 18న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణలోని సామెతను మాత్రమే చెప్పానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు రెండు పేజీల్లో వివరణ ఇచ్చారు. ఆయన సమాధానం పట్ట మహిళా కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది .
ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవినుద్దేశించి వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులిచ్చింది. మార్చి 15న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. పార్లమెంట్ సమావేశాలున్నందును మార్చి 15న హాజరు కాలేనని 18న హాజరవుతానని మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.