
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఖేల్ ఖతం...దుకాణ్ బంద్ అనటానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. ఇక రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లే అని .. వృద్దులకు రూ.4 వేల ఫించన్ కూడా ఇవ్వరని అన్నారు బండి సంజయ్. మహిళలకు నెలనెలా రూ.2 వేల 500, తులం బంగారం ఒట్టిమాటేనని తేలిందని అన్నారు.
నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి రాదనీ.. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇవ్వరని అన్నారు బండి సంజయ్. మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోమని.. రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తామని అన్నారు. సంవిధాన్ చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమయ్యాయని.. రాహుల్ సమాధానం చెప్పి తీరాల్సిందేనని అన్నారు.
►ALSO READ | సమ్మె విరమించండి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..
రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ వన్నీ ఝూటా మాటలేనని.. నాగుపాములెక్క వంకర టింకరగా రోడ్డును నిర్మించింది కాంగ్రెస్సేనని అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించింది కాంగ్రెస్సేనని.. 2035 వరకు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేయించుకున్నది కాంగ్రెస్సేనని అన్నారు. ఆ కాంట్రాక్ట్ తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా.. ఆ సమస్యను పరిష్కరిస్తే 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరిస్తామని 2022లోనే చెప్పలేదా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్.