టీచర్ల అరెస్టును ఖండిస్తున్నాం

V6 Velugu Posted on Jan 15, 2022

హైదరాబాద్ : 317 జీవోను సవరించాలన్న డిమాండ్ తో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఆందోళన చేసిన టీచర్ల అరెస్ట్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న టీచర్లను అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికతకు గొడ్డలిపెట్టుగా మారిన 317 జీవోను వెంటనే సవరించాలని అన్నారు. ఉద్యోగులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. టీచర్ల తరఫున పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

యూపీ ఎన్నికల తొలి లిస్టును ప్రకటించిన బీజేపీ

Tagged Teachers Protest, Hyderabad, go 317, bandi sanjay.bjp state president

Latest Videos

Subscribe Now

More News