పంజాబ్ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

పంజాబ్ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సైతం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొదటి విడతలో 86మంది పేర్లు ప్రకటించింది. పంజాబ్ సీఎం చరణ్ జీత్ చన్నీ చమ్కూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్ సర్ ఈస్ట్పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం సుఖ్జీందర్ సింగ్ రన్దావా డేరా బాబా నానక్ సీటు నుంచి ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ రాజా అమరేందర్ గిద్దర్ బహా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్లో చేరిన నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్కు మోగా సీటు కేటాయించారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే విడదలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

For more news..

యూపీ ఎన్నికల తొలి లిస్టును ప్రకటించిన బీజేపీ

కరోనా నుంచి కోలుకుంటున్న లతా మంగేష్కర్