కరోనా నుంచి కోలుకుంటున్న లతా మంగేష్కర్

కరోనా నుంచి కోలుకుంటున్న లతా మంగేష్కర్

ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కరోనా సోకడంతో  లతా మంగేష్కర్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కోవిడ్కు తోడు నిమోనియా సోకడంతో డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నప్పటికీ మరో 10 రోజుల పాటు ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగించనున్నట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ చెప్పారు. నిపుణులైన డాక్టర్లు ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారని అన్నారు. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు 
ఇదిలా ఉంటే 2019లోనూ లతా మంగేష్కర్కు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. నిమోనియా సోకడంతో అప్పట్లో 28 రోజుల పాటు హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ వివిధ భాషల్లో 30వేలకు పైగా పాటలు పాడారు.  

For more news..

యూపీ ఎన్నికల తొలి లిస్టును ప్రకటించిన బీజేపీ

దేశాభివృద్ధిలో స్టార్టప్ లది కీలక పాత్ర