మేడిగడ్డ ఘటనలో కేసీఆర్‌‌‌‌పై క్రిమినల్​ కేసు పెట్టాలి : బండి సంజయ్‌‌

మేడిగడ్డ ఘటనలో కేసీఆర్‌‌‌‌పై క్రిమినల్​ కేసు పెట్టాలి  : బండి సంజయ్‌‌
  •     ఆస్తులు జప్తు చేసి రూ.లక్ష కోట్లు రికవరీ చేయాలి : బండి సంజయ్‌‌

వేములవాడ, వెలుగు : మేడిగడ్డ కుంగడానికి కారణమైన కేసీఆర్‌‌‌‌పై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టు చేయా లని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ దుర్వినియోగం చేసిన రూ.లక్ష కోట్ల ప్రజా ధనాన్ని ఆయన ఆస్తులు జప్తు చేసి రికవరీ చేయాలన్నారు. బండి సంజయ్ 
చేపట్టిన ప్రజాహిత యాత్ర సోమవారం వేములవాడలో కొనసాగింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఎల్‌‌అండ్‌‌టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వారి పైనా కేసులు పెట్టాలన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దాగుడు మూతలాడుతున్నాయని ఆరోపిం చారు. మేడిగడ్డపై సీబీఐ విచారణను ఎందుకు కోరడంలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌‌ చేశారు. 

అసెంబ్లీలో టైంపాస్‌‌ చేస్తున్నరు..

కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీలో సవాల్ విసురుకుంటూ టైంపాస్ చేస్తున్నాయని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ఆంధ్రోళ్ల కోసం ఒక డుగు ముందుకేసి దక్షిణ తెలంగాణ ప్రజలను ఎండబెట్టి, ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి, ఖ మ్మం జిల్లాలను ఎడారిగా మార్చారన్నారు. కృష్ణా నీళ్లను కేసీఆర్ ఏపీకి తాకట్టుపెడితే.. కాంగ్రెసోళ్లు పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి దక్షిణ తెలంగాణ ప్రజల గుండె మీద తన్నారన్నారు.