కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బహిరంగ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలీ వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్.. నిజమైన హిందువునని చెప్పుకునే కేసీఆర్.. హిందూ ధర్మాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. గోరక్షకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న కరీంనగర్లో కేటీఆర్ ప్రారంభించిన అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని బండి స్పష్టం చేశారు. బహిరంగ సభలో చేసిన విమర్శలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. స్మార్ట్ సిటీ పనుల కోసం కేంద్రం రూ.196 కోట్ల నిధులు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించిందని ఆరోపించారు.

దొంగ దీక్షలు చేసిన మీ అయ్య పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు తాగి ఇంట్లో పన్నడని కేటీఆర్కు బండి సంజయ్ చురకలంటించారు.  ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నందుకే కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వడంలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ లాగా తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదన్న ఆయన.. తనను ఓడింటేందుకు వంద కోట్లు ఖర్చు చేసినా ప్రజలు తననే ఎన్నుకున్నారని చెప్పారు.