- మంత్రి బండి సంజయ్
కొత్తపల్లి, వెలుగు: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తిలో కంటి ఆస్పత్రి ద్వారా పేదలకు అందిస్తున్న సేవలను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ఐ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఔట్ పేషెంట్ వార్డును బండి సంజయ్ సోమవారం ప్రారంభించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో వలంటీర్ గా సేవలందిస్తున్న ఏకైక కంటి ఆస్పత్రి ఇదేనని కొనియాడారు.
హాస్పిటల్ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులిస్తానని, అవసరమైతే కేంద్ర ఆరోగ్యశాఖతో చర్చించి తగిన ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ వేణుమూర్తితోపాటు వైస్ ఛైర్మన్ చిదుర సురేశ్, కార్యదర్శి ప్రకాశ్ హొల్లా, కోశాధికారి బొమ్మ పవన్ కుమార్, డాక్టర్ మురళీధర్ రావు, కోల అన్నారెడ్డి, ముక్క శరత్ క్రిష్ణ, మ్యాడం శివకాంత్, లంబు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.