కన్నడనాట బండి సంజయ్ ప్రచారం...

కన్నడనాట బండి సంజయ్ ప్రచారం...

కర్నాటకలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మధ్య  నువ్వా  నేనా  అన్నట్టు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఈ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా కర్ణాటకలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మూడు రోజుల పాటు కన్నడనాట బండి సంజయ్ ప్రచారం చేస్తారు. 

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా  చిక్ బల్లాపూర, కోలార్ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో బండి సంజయ్ క్యాంపేయిన్ చేస్తారు. ఈనెల 29 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో  ఎంపీ లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ పాల్గొంటున్నారు.