తెలుగులో ప్రమాణం చేసిన ఎంపీలు

తెలుగులో ప్రమాణం చేసిన ఎంపీలు

18వ లోక్ సభ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ  ముందుగా ప్రధాని మోదీ ప్రమాణం చేశారు.  తర్వాత కేంద్రమంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణం చేశారు.   ప్రొటెం స్పీకర్  భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు.

 తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణం చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఎంపీలు ప్రమాణం చేశారు. మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని,నర్సాపురం ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు,దగ్గుబాటి పురంధేశ్వరీ, వైజాగ్ ఎంపీ భరత్ , విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగులో ప్రమాణం చేశారు.

 ఇవాళ 280 మంది ప్రమాణం చేయనున్నారు. రేపు తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేసే అవకాశం ఉంది. 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి. జులై 2 లేదా 3న ఎంపీల ప్రశ్నలకు మోదీ జవాబులిస్తారు. తర్వాత ఉభయ సభల వాయిదా పడే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కోసం  జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.