కరీంనగర్ రూపురేఖలు మారుస్తా : బండి సంజయ్‌‌కుమార్​

కరీంనగర్ రూపురేఖలు మారుస్తా : బండి సంజయ్‌‌కుమార్​

కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ రూపురేఖలు మారుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆదివారం  సప్తగిరి కాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో కరీంనగర్ అసెంబ్లీ నియోకజవర్గ సౌత్, సెంట్రల్ జోన్ , పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్​ మాట్లాడుతూ  ఓట్ల కోసం కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దారుస్సలాంకు తాకట్టుపెట్టిన బీఆర్ఎస్ కావాలా? కేసీఆర్ దుర్మార్గపు పాలనపై పోరాడుతూ  కరీంనగర్ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన బీజేపీ అభ్యర్థి కావాలో ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు.

మంత్రి గంగుల కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టు పెట్టిండని ఆరోపించారు. సిటీలోని 11, 32 డివిజన్లకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈనెల 7న హైదరాబాద్​ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బీసీల ఆత్మగౌరవ సభకు పీఎం నరేంద్రమోదీ వస్తున్నారని, ఆ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.