రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారు

రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారు

రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్ష్ పాండేతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ పడుతున్న ఇబ్బందులను వారికి వివరించినట్లు సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోసపూరిత విధానం వల్ల రైస్ మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని కేంద్రం ఇస్తుంటే..కేసీఆర్ మాత్రం వాటిని పంపిణీ చేయలేదన్నారు. అందుకే మిల్లులలో బియ్యం పేరుకుపోయాయన్నారు

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని..బీజేపీ డిమాండ్ తర్వాత జూన్ నెలలో ప్రజలకు ఉచిత బియ్యం అందించిందని బండి సంజయ్ తెలిపారు. రైస్ మిల్లులలో పేరుకుపోయిన బియ్యాన్ని సేకరించాలని కోరితే కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. కేసిఆర్ కొనేది ఏమిలేదని, కేంద్రమే బియ్యం కొంటుందని తెలిపారు. అవసరమైతే  రైస్ మిల్లర్ల అసోసియేషన్ ను ఢిల్లీ తీసుకెళ్లి..మంత్రి పీయూష్ గోయల్ ని కలిపిస్తామని బండి సంజయ్ తెలిపారు.