ఇవాళ బండి సంజయ్ నామినేషన్.. మహంకాళి ఆలయంలో పూజలు

ఇవాళ బండి సంజయ్ నామినేషన్.. మహంకాళి  ఆలయంలో పూజలు

కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ 2023 నవంబర్ 06 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు నామినేషన్ ధాఖలు చేయనున్నారు.  ఈ క్రమంలో  కరీంనగర్ లోని మహంకాళి  ఆలయంలో  నామినేషన్ పత్రాలకు పూజ నిర్వహించారు సంజయ్. 

అనంతరం  కరీంనగర్ లోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి  గీతాభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తరువాత అక్కడినుంచి పాదయాత్రగా కలెక్టర్ రేట్ వరకు వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ ధాఖలు చేయనున్నారు.   

ఈ కార్యక్రమంలో   బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్,  గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ అతిధులుగా హాజరు కానున్నారు.