బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టం

బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టం

ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో న్యాయ పోరాటం చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులు ఆత్మహత్య చేసుకునేలా  టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే మరణ వాంగ్మూలం నమోదు చేయలేదన్నారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. తక్షణమే మంత్రి, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందేనన్నారు. బిజెపి కార్యకర్తల, యువకుల శోకానికి ఫలితం అనుభవించక తప్పదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోమని.. ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో 4 వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ కొనసాగుతోంది. చండూరు పాదయాత్ర శిబిరం దగ్గర బీజేపీ కార్యకర్త సాయి గణేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. సాయి గణేష్ ఘటనలో బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు సంజయ్.