జూన్ 23 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

జూన్ 23 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. 2వ విడుత ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ ఫుల్ గా ముగియడంతో మూడో విడుతపై ఫోకస్ పెట్టారు కమలంశ్రేణులు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాక్షేత్రంలోకి ఎలాంటి కార్యక్రమాలతో వెళ్లాలన్న దానిపై చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పాదయాత్రపై సమాలోచనలు చేశారు.

జూన్ 23 నుంచి మూడో విడత పాదయాత్ర చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. జూలై 12 వరకు బండి సంజయ్ యాత్ర కొనసాగనుంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంగ్రామ యాత్ర సాగుతుంది. అగష్టు చివరిలోపు నాలుగో విడుత పాదయాత్ర కూడా పూర్తి చేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. మూడు, నాలుగో విడుత పాదయాత్రలు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరగనుంది. అయితే సంజయ్ పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. 

కాగా ప్రజాసంగ్రామ యాత్ర మొదటి, రెండో విడత పాదయాత్రలు 67రోజుల పాటు సాగింది. 13 జిల్లాల్లోని 9 పార్లమెంట్, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగింది. ఇక నుంచి నెలలో 20రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని..మిగిలిన 10రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం

నయా ట్రెండ్: పాత టైటిల్స్ తో కొత్త స్టోరీస్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం