జనం చచ్చిపోతున్నా.. తండ్రీకొడుకులు స్పందించరా: బండి సంజయ్ 

జనం చచ్చిపోతున్నా.. తండ్రీకొడుకులు స్పందించరా: బండి సంజయ్ 

సచ్చినోళ్ళకు సంతాపం.. బతికిఉన్నోళ్లకు పరిహారం అన్నట్లున్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సికింద్రాబాద్ (Secunderabad )లో అగ్నిప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) ను మార్చి 17న బండి సంజయ్ సందర్శించి పరిశీలించారు. సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటుందని.. ఇలాంటి దుర్ఘటన జరిగి ఎంతమంది చనిపోతున్నప్పటికీ కేటీఆర్, కేసీఆర్(Kcr,Ktr) స్పందించకపోవడం దారుణమన్నారు బండి సంజయ్. లిక్కర్ కేసులో కవిత ఇరుకుంటే రాష్ట్రమంత్రి వర్గమంతా అక్కడికి వెళ్ళింది..కానీ ఈ ఘటనపై స్పందించరని మండిపడ్డారు. పూర్తిగా విచారణ జరిపి మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

గతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని బండి సంజయ్ ప్రశ్నించారు. అధికార యంత్రాంగం అంతా ఏమి చేస్తుందని నిదీశారు. దుర్ఘటన జరిగిన వెంటనే తూతూమంత్రాంగా నష్టపరిహారం ప్రకటించి చేయి దులుపుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బండి సంజయ్ పేర్కొన్నారు.