బీజేపీ పేరు చెప్పి ప్రైవేటీకరిస్తే ఊకోం: బండి సంజయ్  

 బీజేపీ పేరు చెప్పి ప్రైవేటీకరిస్తే ఊకోం: బండి సంజయ్  

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/కాటారం, వెలుగు:   సింగరేణి రాష్ట్ర సర్కారుకు జేబు సంస్థగా మారిందని, ఆ సంస్థ గనులు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ‘‘సింగరేణిని కేసీఆర్ ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేయబోతోంది. కార్మికులకు సక్కగా నెలవారి జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చిండు. బీజేపీ పేరు చెప్పి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే బట్టలూడతీసి కొడ్తం” అని ఆయన ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హరీశ్ రావు కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుంటే మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కుక్కలు కూడా దేకవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని కామెంట్ చేశారు. మంథని నియోజకవర్గ బీజేపీ ఇన్​చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగింది. సభకు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ముందుగా కాటారం సెంటర్ నుంచి మద్దులపల్లి గ్రామంలోని ఎల్జీ గార్డెన్ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో120 రోజుల పాటు 56 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను తెలుసుకున్నామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ సర్కార్ రావడం ఖాయమన్నారు.   

తాడిచర్ల మైనింగ్​లో వేల కోట్ల స్కాం  

తాడిచర్ల ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైనింగ్​లో కేసీఆర్ రూ.20 వేల కోట్ల స్కాం చేశాడని బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల మంథని నియోజకవర్గంలోని స్థానిక రైతులకు ఒరింగేదేమీ లేదన్నారు. వేలాది ఎకరాల పంట భూములు కోల్పోయిన రైతన్నలను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు వందల కోట్లు కాజేశాడని ఆరోపించారు. కేసీఆర్ పేరును పక్కకు పెడితే మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కుక్కలు కూడా దేకవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని సంజయ్ అన్నారు. సామాన్య కార్యకర్త అయిన మోడీ దేశానికి ప్రధాని అయిండని, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు కాకుండ వేరే వ్యక్తులను పార్టీ ప్రెసిడెంట్ ను చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ గద్దె కూల్చుడు బీజేపీ చేతిలోనే: వివేక్ 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రాజెక్టుతో వేలాది ఎకరాలు మునిగిన రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ తన కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారన్నారు. పేదలకు డబులు బెడ్రూం ఇండ్ల హామీని నెరవేర్చలేదన్నారు. కరెంట్, ఆర్టీసీ చార్జీలు, పెంచి పేదోళ్ల నడ్డి విరిచారన్నారు. పెట్రోలు, డీజిల్ రేట్లు మిగతా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే రూ. 10 ఎక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ జెండా గద్దెలను కొందరు బీఆర్ఎస్ నాయకులు కూలుస్తున్నారని, కానీ కేసీఆర్ గద్దె కూల్చడం బీజేపీ చేతిలోనే ఉందన్నారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ప్రైవేటీకరణతో రూ. 20 వేల కోట్ల కుంభకోణం చేసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీబీఐతో విచారణ జరపాలని వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సభలో పార్టీ నేతలు చందుపట్ల సునీల్ రెడ్డి, కీర్తి రెడ్డి, పాపన్న, చందుపట్ల రామ్ రెడ్డి, దుర్గం తిరుపతి, పాగె రంజిత్, భాస్కర్ రెడ్డి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.