ఓటమి భయంతోనే కేసీఆర్ జిల్లాల టూర్లు 

ఓటమి భయంతోనే కేసీఆర్ జిల్లాల టూర్లు 

ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు.కేంద్రం బాయిల్డ్ రైస్ కొటామనే చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు 62 వేల కోట్లు బకాయి ఉందన్నారు.20 గ్రామాలకు సరిపడా విద్యుత్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఫ్రీగా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం దాడి చేస్తుందనే పాత బస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను సేకరిస్తున్నామని..త్వరలో అన్ని వివరాలు బయటపెడతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయన్న బండి సంజయ్..కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సామాన్య ప్యాలెస్ లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఎంపీలు సాయం బాపురావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు. జిల్లాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించారు.ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ జిల్లాల టూర్లు చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ