టైమ్ పాస్ కోసం కేసీఆర్ ఢిల్లీకి పోతుండు : బండి సంజయ్

టైమ్ పాస్ కోసం కేసీఆర్  ఢిల్లీకి పోతుండు :  బండి సంజయ్

బీఆర్ఎస్ చీఫ్ Sanjay satires on KCR. రేపు టైమ్ పాస్ కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని  విమర్శించారు.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బీజేపీ విజయ సంకల్ప సభలో  సంజయ్ పాల్గొన్నారు.  గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్, కేసీఆర్ వల్ల పేద ప్రజలకు ఏమైనా  న్యాయం జరిగిందా?  అని ప్రశ్నించారు. రాష్ట్రానికి  మోదీ ప్రభుత్వం అని, డబ్బులు ఇస్తుంటే..  ఓట్లు మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వేస్తున్నారని అన్నారు. 

మొదట బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఎవరికీ ఇచ్చిన పేద ప్రజలకు న్యాయం జరగడంలేదన్నారు సంజయ్.   ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిందని... ఇప్పుడు హామీల గురించి అడిగితే   ఆ పార్టీ నేతలు  తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.  వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.