వీర జవాన్ల బలిదానాన్ని అవమానించేలా మాట్లాడుతున్నరు

 వీర జవాన్ల బలిదానాన్ని అవమానించేలా మాట్లాడుతున్నరు

సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో వీర జవాన్ల బలిదానాన్ని అవమానించేలా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. యువతెలంగాణ పార్టీ.. బీజేపీలో విలీనం చేసిన సందర్భంగా ఢిల్లీలో మాట్లాడారు సంజయ్. టీఆర్ఎస్ ముక్త్ నినాదంతో జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ బీజేపీలో చేరారని చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు సంజయ్.