భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన ప్రభుత్వం

భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన ప్రభుత్వం

భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వినాయక నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై క్రేన్లు ఏర్పాటు చేయిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అయినా ఇప్పటికీ తూతూ మంత్రంగానే నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రుల అబద్ధాలకు అడ్డూ అదుపు లేదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఒక నాస్తికుడు అని బండి సంజయ్ కామెంట్ చేశారు.

‘‘ ట్యాంక్ బండ్ పై హిందువులు ఇబ్బందులు పడుతుంటే దారుస్సలాంలో సంబురాలు చేసుకుంటున్నారు.  దారుస్సలాంను సంతృప్తి పర్చడానికి హిందువులను ఇబ్బంది పెడతారా? నిఖార్సైన హిందువని చెప్పుకుంటున్న కేసీఆర్ కు కావాల్సింది ఇదేనా? ’’ అని వ్యాఖ్యానించారు. నిఖార్సైన కేసీఆర్ హిందుత్వ బండారాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘ హిందువులారా.... సద్ది కట్టుకుని ట్యాంక్ బండ్ వద్దకు రండి. ట్యాంక్ బండ్ పైనే వినాయక నిమజ్జనం చేద్దాం’’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.