చెప్పిన టైంకే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

చెప్పిన టైంకే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

హైదరాబాద్ :  చెప్పిన టైంకే చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ కు వచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజయ్ వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంధర్ రెడ్డి, MLC రాంచందర్ రావు, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ఆలయ ట్రస్టీ శశికళా ఆహ్వానం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ పూజారులు.  ఆ తర్వాత ఆలయం చుట్టు ప్రద్రక్షణలు చేశారు.

బండి సంజయ్  చార్మినార్ టూర్ తో  గ్రేటర్ లో  టెన్షన్ వాతావరణం నెలకొంది. వరద సాయంపై  సంజయ్ సవాల్ తో  అలర్ట్ అయ్యారు  హైదరాబాద్ పోలీసులు. బీజేపీ స్టేట్  ఆఫీస్ తో పాటు  చార్మినార్ పరిసర ప్రాంతాల్లో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోర్జరీ సంతకం  విషయంలో  తనపై అసత్య  ప్రచారాన్ని ఖండించిన సంజయ్… సీఎం కేసీఆర్ కు సవాల్  విసిరిన విషయం తెలిసిందే. లేఖ రాసింది  తాను కాదని… కావాలంటే భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణానికి సిద్ధమన్నారు. కేసీఆర్ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రావాలన్నారు బండి సంజయ్.