
దళిత సాధికారత సమావేశంలో ఇచ్చిన హామీకి కట్టుబడి తక్షణమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సెక్రటేరియట్ లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలంటూ సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటినా సెక్రటేరియట్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు లేకపోవడం దారుణమన్నారు. 2018 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులలో రిజర్వేషన్ల అంశంపై ఎం.నాగరాజ్ వర్సెస్ జర్నైల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి జరిగిన పదోన్నతులను 6 నెలల్లోగా సమీక్షించాలని తీర్పునిచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్.