అత్యాచార ఘటనపై సీఎంకు బండి సంజయ్ లేఖ

అత్యాచార ఘటనపై సీఎంకు బండి సంజయ్ లేఖ

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఈ దురదృష్ట సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగి నాలుగు రోజులు కావొస్తున్నా పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అత్యాచార ఘటనలో రాష్ట్ర హోం మంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకులు ప్రమేయం ఉన్నట్లు మీడియాలో అనేక వార్తలు వస్తున్నాన్పప్పటికీ... నిందితుల వివరాలు ఇప్పటి వరకు బయటపెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు.

ఇప్పటికైనా హోం మంత్రి, పోలీస్ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత ఇప్పించాలని సీఎంని కోరారు. సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి మనవడిపైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సీఎంని ఎన్నో సార్లు కోరనప్పటికీ పట్టించుకోవడంలేదన్నారు. పబ్బులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం

బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తేవాలి