
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హ్యాండ్సమ్ హంక్ రానా నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. రిలీజ్ కు మరికొన్ని గంటలే ఉన్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ స్టార్ వీరాభిమానిగా చెప్పుకునే ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా ‘భీమ్లా నాయక్’ బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. పవన్ ను దేవరగా సంబోధిస్తూ బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశాడు. భీమ్లా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ కావాలని ఆయన ట్వీట్ చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా ఈ మూవీకి అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు. ‘చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర’ అంటూ పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ... ?
— BANDLA GANESH. (@ganeshbandla) February 24, 2022
చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర @PawanKalyan ??????????? pic.twitter.com/lVGITxiMnr
మరిన్ని వార్తల కోసం: