
ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాతో కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటున్నారు. ఆ పరిచయాలతో పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ ఉన్నారు, అదే పరిచయాలతో మోసపోయిన వాళ్లూ ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి వాట్సాప్ పరిచయంతో మోసపోయాడు. ఏకంగా రూ. 6 లక్షలు పొగొట్టుకున్నాడు.
బెంగుళూరుకు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తికి.. గత రెండేళ్ల నుంచి పరిచయం లేని మహిళ వాట్సాప్‌లో ‘గుడ్ మార్నింగ్’ అంటూ విష్ చేస్తుంది. ఇలా ఇప్పటివరకు ఆమె నుంచి 20సార్లకు పైగా ఈ మెసెజ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో గత నెల అక్టోబర్ 8న ఆమె నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటూ మెసెజ్ వచ్చింది. తనను కలవడానికి వీరనపాళ్యం సమీపంలోని ఓ హోటల్‌కు రావాలంటూ మహిళ లొకేషన్ కూడా షేర్ చేసింది. దాంతో ఆ వ్యక్తి అదే రోజు రాత్రి ఆమెను కలవడానికి హోటల్‌కి వెళ్లాడు. మహిళ చెప్పిన రూంలోకి వెళ్లిన వ్యక్తి.. అక్కడ ముగ్గురు వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. వారు తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకొని.. బాధితుడిని డ్రగ్స్ వ్యాపారిగా ఆరోపిస్తూ బెదిరించారు. ఆ తర్వాత బాధితుడి నుంచి పర్స్ లాక్కొని క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకొని.. బలవంతంగా ఫోన్ అన్‌లాక్ చేయించారు. అనంతరం బాధితుడిని రూంలో బంధించి.. హోటల్ నుంచి వెళ్లిపోయారు.
ఎలాగోలాగా గది నుంచి బయటపడిన బాధితుడు.. ఇంటికి చేరుకునేసరికి తన క్రెడిట్ కార్డు నుంచి అయిదు విడతలుగా రూ.3,91,812 నగదు బదిలీ అయినట్లు గుర్తించాడు. మరి కాసేపటి తర్వాత మరో రూ. 2 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినట్లు మెసెజ్ వచ్చింది. దాంతో బాధితుడు గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడికి మెసెజ్ వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
For More News..