‘బంగార్రాజు’.. బరిలోకి దిగాడు 

V6 Velugu Posted on Aug 21, 2021

‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో బంగార్రాజు పాత్రలో నాగార్జున చేసిన సందడి తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అందుకే సీక్వెల్‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి ఐదేళ్ల తర్వాత ‘బంగార్రాజు’ బరిలోకి దిగాడు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నాగ్‌‌‌‌తో పాటు మరో హీరోగా నటిస్తున్న నాగచైతన్య, అతనికి జోడీగా కనిపించనున్న కృతీశెట్టి, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, నాగసుశీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగ్‌‌‌‌కి జంటగా ఈసారి కూడా రమ్యకృష్ణే నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

Tagged Naga Chaitanya, Nagarjuna, , Bangarraju, KrithiShetty

Latest Videos

Subscribe Now

More News