
రాజ్‌గిర్: ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ హాకీ టోర్నీ నుంచి పాకిస్తాన్, ఒమన్ జట్టు మెన్స్ తప్పుకున్నాయి. దీంతో ఈ రెండు దేశాల ప్లేస్‌లో బంగ్లాదేశ్, కజకిస్తాన్‌కు అవకాశం కల్పించారు. పూల్–ఎలో ఇండియాతో పాటు చైనా, జపాన్, కజకిస్తాన్ ఉన్నాయి. కొరియా, మలేసియా, చైనీస్‌తైపీ, బంగ్లాదేశ్.. పూల్–బిలో ఉన్నాయి. ఇందులో విజేతగా నిలిచిన జట్టు బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే 2026 వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతుంది.
ఈ నెల29 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఇండియాలో ఈ టోర్నీ జరగనుంది. ఆసియా కప్‌లో పాల్గొనేందుకు వీసాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే వెల్లడించినా.. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పాక్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో బంగ్లా ముందుగానే చర్చలు జరపడంతో దానికి చాన్స్ ఇచ్చారు. ఆసియా కప్‌లో ఇప్పటి వరకు ఐదుసార్లు టైటిల్ నెగ్గిన కొరియా ఈసారి కూడా ఫేవరెట్‌గా దిగుతోంది. ఇండియా, పాకిస్తాన్ చెరో మూడుసార్లు విజేతలుగా నిలిచాయి.