కోల్కతా: బంగ్లాదేశ్ ఎంపీ ఒకరు కోల్కతాలో హత్యకు గురయ్యారు. కోల్కతాలోని న్యూటౌన్లో బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం (మే 22) హత్య చేశారు. ఎంపీ అన్వరుల్ మే 12న మెడికల్ చెకప్ కోసంబంగ్లాదేశ్ నుంచి కోల్ కతా వచ్చినట్టు తెలుస్తోంది. అజీమ్ బంగ్లాదేశ్ లోని జెనైదా 4 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు.
కోల్ కతా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు గురైనట్లు భావిస్తున్న భవనంలో రక్తపు మరకలు కనుగొన్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది. హత్య చేసి మృతదేహాన్ని ఆ ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు పోలీసులు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యను బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ధృవీకరించారు. అధికార పార్టీ ఎంపీ అజీమ్ ను కోల్ కతాలో హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని.. హంతకులు బంగ్లాదేశీకులేనని ఖాన్ చెప్పారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
