ఆసియా కప్ 2023 కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన జట్టును ప్రకటించింది. తమీమ్ ఇక్బాల్ స్థానంలో షకీబ్ అల్ హసన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గాయం కారణంగా ఆసియా కప్ నుంచి వైదొలగడంతో ఓపెనర్ ఇక్బాల్ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే షకీబ్ టెస్టు, టీ20 లకు అతను కెప్టెన్‌గా ఉన్నాడు.
ఈ ఏడాది జరగనున్న న్యూజిలాండ్ సిరీస్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కు కూడా షకిబ్ అల్ హసన్ కెప్టెన్ గా వ్యవహరించినట్లుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. కాగా 2023 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2023 జరగనుంది.
బంగ్లాదేశ్ జట్టు:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్ ), లిట్టన్ దాస్, తంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ , మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ , హసన్ మమ్హుద్, మహిదీ హసన్, నసుమ్, షొహ్మద్, షఫీ హసన్, నసుమ్, ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్, మొహమ్మద్ నయీమ్