పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. మరోసారి యువత ఆగ్రహానికి గురైంది. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూలదోసిన అదే యువశక్తి ఇప్పుడు మహమ్మద్ యూనస్నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంపై తిరగబడింది..గత ప్రభుత్వం చేసిన తప్పే యూనస్తాత్కాలిక ప్రభుత్వం కూడా చేస్తుందని యువత మరోసారి ఆందోళనకు దిగింది.
బంగ్లాదేశ్ మరోసారి యువత ఆగ్రహాన్ని చవిచూసింది. గతంలో దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చేసి అదే యువ శక్తి ఇప్పుడు ప్రధాన సలహాదారు యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై విరుచుకుపడింది. పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ పోస్టులను రద్దు చేయడంతో తిరుగుబాటు చేశారు. ఈ వార్తలు వచ్చిన వెంటనే ఢాకా నుంచి చిట్టగాంగ్ వరకు దేశవ్యాప్తంగా యూనివర్సిటీల క్యాంపస్‌లలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
పాఠశాలల్లో మ్యూజిక్‌ను నిశ్శబ్ద పర్చవచ్చునేమోగానీ మా హృదయాల్లోకాదు అంటూ నినాదాలు చేస్తే వీధుల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. బంగ్లాదేశ్ సాంస్కృతిక గుర్తింపును రక్షించడమే లక్ష్యంగా యువత రోడ్లపై కి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆందోళన క్రమంలో బంగ్లాదేశ్ వీధుల్లో హింస చెలరేగింది. ఢాకాలోని కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్ విధించారు. ఇది బంగ్లాదేశ్ లో పెరుగుతున్న అశాంతిని ఆజ్యం పోసింది. కేవలం పరిపాలనపరమైన నిర్ణయానికి వ్యతిరేకంగా కాకుండా యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఇస్లామీకరణ చేయడంపై యుద్దంగా విద్యార్థులు ,సాంస్కృతిక గ్రూపులు ఈ నిరసనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
