
ఆసియా కప్ లో బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియా ఎలాంటి సమీకరణలతో పని లేకుండా ఫైనల్ కు చేరుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఎలాగైనా టీమిండియాకు షాక్ ఇచ్చి ఫైనల్ కు చేరువవ్వాలని చూస్తోంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సమరంలో ఇండియా గెలిస్తే శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. బంగ్లాదేశ్ విషయానికి వస్తే కెప్టెన్ లిటన్ దాస్ గాయం కారణంగా అందుబాటులో ఉండడం లేదు. జేకర్ అలీ బంగ్లా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు
ఇండియా (ప్లేయింగ్ 11):
అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11:
సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ (కెప్టెన్, వికెట్ కీపర్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్
►ALSO READ | IND vs AUS: రెండో వన్డే కూడా మనదే.. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన యంగ్ ఇండియన్ టీమ్