సార్‌‌‌‌ ఫిలాసఫీ

సార్‌‌‌‌ ఫిలాసఫీ

ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్..‘సార్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసిన టీమ్.. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్‌‌ను కూడా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ‘మాస్టారూ’ పాటను రిలీజ్ చేయగా.. మంగళవారం ‘బంజారా’ సాంగ్‌‌ను విడుదల చేశారు.

జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన సాంగ్‌‌కు ఆలోచింపజేసేలా లిరిక్స్ రాశారు సుద్దాల అశోక్ తేజ. ‘ఆడవుంది నీవే, ఈడ ఉంది నీవే.. నీది కానీ చోటే లేనేలేదు బంజారా.. యాడ పుట్టె తీగ, యాడ పుట్టె బూర.. తోడు కూడినాక మీటి చూడు తంబూర’ అంటూ సుద్దాల రాసిన పదాలు ఇంప్రెస్ చేస్తున్నాయి. ‘ఏదీ మన సొంతం కాదు.. కష్టాలు, సుఖాలు శాశ్వతం కాదు.. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం’ అని పదునైన పదాలతో, లైఫ్‌‌ ఫిలాసఫీ చెబుతున్నట్టుగా ఉన్నాయి లిరిక్స్. అనురాగ్ కులకర్ణి పాడిన తీరు పాటకు హైలైట్‌‌. లెక్చరర్‌‌‌‌ పాత్రలో ధనుష్ చేసిన సింపుల్ మూమెంట్స్, విలేజ్ లొకేషన్స్ ఆకట్టుకున్నాయి. సాయికుమార్, తనికెళ్ల భ‌‌ర‌‌ణి, సముద్ర ఖని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది.