
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ రోడ్ నంబర్2లోని వరుణ్ మోటార్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేండ్లుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా వ్యాపారం చేస్తుండడంతో శుక్రవారం చర్యలు తీసుకున్నారు. ట్రేడ్ లైసెన్స్ తో పాటు మూడేండ్లుగా అడ్వర్టైజ్మెంట్ ఫీజు బకాయి ఉండడంతో అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. జూన్ 30 లోపు చెల్లింపులు చేయాలని చెప్పినా స్పందించలేదు. చివరకు షోరూమ్సీజ్ చేయడంతో నిర్వాహకులు వెంటనే జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి ట్రేడ్ లైసెన్స్ పాటు అడ్వర్టైజ్మెంట్ టాక్స్ అన్నీ కలిపి సుమారు రూ.3.35 లక్షలు చెల్లించారు. తిరిగి కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించారు.