తొందరగా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తొందరగా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, వెలుగు: తొందరగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని  ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని పొందాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను శుక్రవారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోరంటాలలో ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం లోతు వాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి స్థలాన్ని  పరిశీలించారు. ఆయన వెంట డీఆర్డీవో శేషాద్రి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

మరిమడ్ల ఏకలవ్య స్కూల్ తనిఖీ

కోనరావుపేట, వెలుగు: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను సూచించారు.శుక్రవారం కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్యమోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. హాస్టల్ కిచెన్ రూమ్, పరిసరాలను పరిశీలించారు.