
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్యాణ లక్ష్మి ధనంతో.. అప్పుల రికవరీ చేస్తున్నారు బ్యాంక్ అధికారులు. గతంలో లబ్ధి దారులు తమ బ్యాంక్ నుంచి తీసుకున్న బాకీలు వసూలు చేసి.. మిగిలిన సొమ్ముని ఇస్తున్నారు ములకలపల్లి APGVB అధికారులు. ప్రభుత్వ పథకాలకు, బ్యాంక్ అప్పులను జమ చేయొద్దని ప్రభుత్వం చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. అధికారుల బలవంతపు వసూళ్లను అడ్డుకోవాలని కోరుతున్నారు.