
ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అయిన 28 ఏళ్ల వ్యక్తి బాంద్రా-వర్లీ సీ లింక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 11న జరిగిన ఈ ఘటనలో మృతుడు సెంట్రల్ ముంబైలోని పరేల్ నివాసి ఆకాష్ సింగ్‌గా గుర్తించారు. అంతకుముందు రోజు రాత్రి, అతను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుంచి పరేల్‌కు వెళ్లడానికి టాక్సీలో ఎక్కాడు. అయితే సీ లింక్‌కు తీసుకెళ్లమని డ్రైవర్‌ను కోరాడని వర్లీ పోలీసు అధికారి తెలిపారు.
వంతెనపై ఉండగా, ఫోన్‌లో మాట్లాడుతున్న సింగ్, అకస్మాత్తుగా తన మొబైల్ ఫోన్ పడిపోయిందని చెప్పినట్టు అధికారి తెలిపారు. డ్రైవర్ ట్యాక్సీని పక్కకు తీయడంతో సింగ్ కిందకు దిగి సముద్రంలోకి దూకాడని చెప్పారు. అతని మృతదేహాన్ని రాత్రి తర్వాత బయటకు తీశారని అధికారి తెలిపారు. ప్రాథమిక విచారణలో, తల్లిదండ్రులతో ఉంటున్న సింగ్ మూడు నెలల క్రితం తన ప్రియురాలితో విడిపోయాడు. కాగా ఈ కేసుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.