జూన్ నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు

వచ్చేనెల జూన్ లో బ్యాంకులకు భారీగానే హాలీడేస్ ఉన్నాయి. నెల మొత్తం మీద దేశంలోని అన్నీ ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు 12 రోజులు సెలువు దినాలు ఉన్నట్లు క్యాలెండర్ లో స్పష్టంగా తెలస్తోంది. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో కలుపుకోని ఆరు కామన్ హాలీడేస్ తోపాటు మరో ఆరు ఫెస్టివల్ హాలీడేస్ ఉన్నాయి. సెలవులు ఏయే రోజు ఎక్కడెక్కడంటే..
జూన్ 9న హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో మహారాణా ప్రతాప్ జయంతి
10న పంజాబ్ లో అమరవీరుల దినోత్సవం 
14న పహిలి రాజా కారణంగా ఒడిశాలో బ్యాంకులు బంద్
15న YMA డే
17న బక్రీద్, 21న సావిత్రి వ్రతం ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక సెలువుల కారణంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. 
జూన్ 8 సెకండ్, జూన్ 22 నాల్గొవ శనివారాలు కాబట్టి బ్యాంక్ హాలిడేస్. జూన్ 2, 9, 16, 23 మరియు 30 భారతదేశం అంతటా ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ లో పని ఉంటే ఈ షెడ్యూల్ ఆదారంగా కస్టమర్లు ప్లాన్ చేసుకోవాలని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను నిర్ణయిస్తుంది,