February Bank Holidays : ఫిబ్రవరి నెల వచ్చేసింది.. 11 రోజులు బ్యాంకులు బంద్

February Bank Holidays  : ఫిబ్రవరి నెల వచ్చేసింది..  11 రోజులు బ్యాంకులు బంద్

2024లో రెండో నెల వచ్చేసింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 29 రోజులకు గానూ 18 రోజుల పాటు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.  11 రోజుల పాటు బ్యా్ంకులు మూతపడనున్నాయి.   ఇందులో రెండు, నాలుగో శనివారాలు, అలాగే ఆదివారాలు కలిపి 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.  బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ప్రకటించింది.  ఈ సెలవుల జాబితాలో  కొన్ని రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరికొన్ని జాతీయ సెలవులు ఉన్నాయి. 


ఫిబ్రవరిలో బ్యాంక్​ సెలవుల వివరాలు..

  • 4 ఫిబ్రవరి: ఆదివారం
  • 10 ఫిబ్రవరి: రెండవ శనివారం / లోసార్లో- గ్యాంగ్టక్​లోని బ్యాంక్​లకు సెలవు
  • 14: వసంత పంచమి / సరస్వతీ పూజ (శ్రీ పంచమి)- అగర్తలా, భువనేశ్వర్, కోల్​కతాలోని బ్యాంకులకు సెలవు.
  • 15 ఫిబ్రవరి: లుయి-ఎన్​గై ని- ఇంఫాల్​లోని బ్యాంకులకు సెలవు.
  • 18 ఫిబ్రవరి: ఆదివారం
  • 19 ఫిబ్రవరి : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి- బేలాపూర్, ముంబై, నాగపూర్ లో బ్యాంకులకు సెలవు.
  • 20 ఫిబ్రవరి: ఐజ్వాల్ లో బ్యాంకులకు సెలవు.
  • 24 ఫిబ్రవరి: రెండో శనివారం
  • ఫిబ్రవరి 25: ఆదివారం
  • ఫిబ్రవరి 26: నైకూమ్- ఇటానగర్ లో బ్యాంకులకు సెలవు

ఈ సేవలు పనిచేస్తాయి..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.