జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..

జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2023, జూన్ నెల సెలవులు ప్రకటించాయి. రెండు కేటగిరీట్లో ఈ సెలవులు వర్తిస్తాయని ప్రకటించాయి. జూన్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు చూద్దాం..

జూన్ 4వ తేదీ – ఆదివారం
జూన్ 10వ తేదీ – రెండో శనివారం
జూన్ 11వ తేదీ – ఆదివారం
జూన్ 18వ తేదీ – ఆదివారం
జూన్ 24వ తేదీ – నాలుగో శనివారం
జూన్ 25వ తేదీ – ఆదివారం

దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్కడి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆ రాష్ట్రాలు ఏంటో తెలుసుకుందాం.

జూన్ 15వ తేదీ – ఒరిస్సా, మిజోరంలో రాజ సంక్రాంతి సందర్భంగా బ్యాంక్ హాలిడే
జూన్ 20వ తేదీ – ఒరిస్సాలో బ్యాంక్ హాలిడే, రథయాత్ర సందర్భంగా
జూన్ 26వ తేదీ – త్రిపురలో బ్యాంకులకు సెలవు. కర్చీ పూజ సందర్భంగా..