ఆగస్టులో బ్యాంకులకు భారీ సెలవులు... లిస్ట్ రిలీజ్ చేసిన ఆర్బీఐ..

ఆగస్టులో బ్యాంకులకు భారీ సెలవులు... లిస్ట్ రిలీజ్ చేసిన ఆర్బీఐ..

మరో వారం రోజుల్లో జులై నెల ముగియబోతోంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు జూలై 2023 నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిలీజ్ చేసింది.  శని, ఆదివారాలు, పండుగలు కలుపుకుంటే ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు ఓనం, రక్షా బంధన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు నెలలో బ్యాంక్ సెలవుల  జాబితాను ఓ సారి చూద్దాం..

ఆగస్టులో బ్యాంకులకు చాలా సెలవులు ఉండనున్నాయి. పండుగలు, జన్మదినోత్సవాలు, శని, ఆదివారాల వల్ల ఆగస్టులో చాలా రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న దేశవ్యాప్తంగా బ్యాంకులు, మూతపడనున్నాయి.

ఆగస్టులో నెలలో సెలవులు ఇవే

  • 6 ఆగస్టు 2023 - ఆదివారం కారణంగా సెలవు.
  • 8 ఆగస్టు 2023 - రమ్ ఫాట్ కారణంగా గ్యాంగ్టక్ లోని టెండాంగ్ లో సెలవుదినం -
  • 12 ఆగస్టు 2023- రెండో  శనివారం బ్యాంకులకు సెలవు
  • 13 ఆగస్టు 2023- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు
  • 15 ఆగస్టు 2023- స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా సెలవు
  • 6 ఆగస్టు 2023- పార్సీ నూతన సంవత్సరం కారణంగా ముంబై, నాగూర్, బేలాపూర్ లో బ్యాంకులకు సెలవు
  • 18 ఆగస్టు 2023- శ్రీమంత శంకర్దేవ్ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు మూసివేత
  • 20 ఆగస్టు 2023- ఆదివారం బ్యాంకులకు సెలవు
  • 26 ఆగస్టు 2023 - నాల్గో శనివారం బ్యాంకులకు సెలవు
  • 27 ఆగస్టు 2023- ఆదివారం బ్యాంకులకు సెలవు 
  • 28 ఆగస్టు 2023 - మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
  • 29 ఆగస్టు 2023  తిరువీణం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు 
  • 30 ఆగస్టు 2023- రక్షా బంధన్ కారణంగా జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
  • 31 ఆగస్ట్ 2023 - శ్రీ నారాయణ గురు జయంతి / పాంగ్ అబ్బోల్ కారణంగా డెహ్రాడూన్, గాంగ్టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో , తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.