బ్యాంక్​ ఆఫ్​ ఇండియా లాభం 1,458 కోట్లు

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా లాభం 1,458 కోట్లు

న్యూఢిల్లీ:  బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023–-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.1,458 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. ఇది క్రితం సంవత్సరం కాలంలో నమోదైన రూ.960 కోట్లతో పోలిస్తే 52 శాతం ఎక్కువ.

ఈ ప్రభుత్వ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రెండో క్వార్టర్​లో రూ.5,740 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో వచ్చిన రూ.5,083 కోట్లతో పోలిస్తే 13 శాతం మెరుగుపడింది. తాజా క్వార్టర్​లో వడ్డీయేతర ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,417 కోట్ల నుంచి రూ.1,688 కోట్లకు చేరింది. రెండవ క్వార్టర్​లో బ్యాంక్ నిర్వహణ లాభం రూ.3,756 కోట్లకు చేరింది. 

ALSO READ : ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లైలో వాటాలు అమ్ముతున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వీ