
న్యూఢిల్లీ: తనఖా లోన్లు ఇచ్చే మార్ట్గేజ్గ్యారంటీ కంపెనీ ఇండియా మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజీసీ ), భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఓఐ) తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.
శాలరీడ్, సెల్ఫ్ఎంప్లాయ్డ్ కస్టమర్లకు హోంలోన్ లోన్లు ఇస్తారు. భారతదేశం అంతటా 5,100కి పైగా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో ఈ ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి. ఐఎంజీసీ హామీ వల్ల బ్యాంకుకు డిఫాల్ట్‌ల ప్రమాదం తగ్గుతుంది. తాము తనఖా గ్యారెంటీ ఇవ్వడం వల్ల లోన్ల సంఖ్య పెరుగుతుందని ఐఎంజీసీ తెలిపింది.