భూమి వేలం వేస్తామంటూ సహకార బ్యాంకు ఫ్లెక్సీ

భూమి వేలం వేస్తామంటూ సహకార బ్యాంకు ఫ్లెక్సీ

లింగంపేట, వెలుగు: అప్పు చెల్లించనందుకు భూమిని వేలం వేస్తామని పేర్కొంటూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆఫీసర్లు గురువారం వ్యవసాయ పొలంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.  లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన రాజశేఖర్​రెడ్డి అనే  రైతు లింగంపేటలోని ఎన్​డీసీసీ బ్యాంక్​లో  గతంలో అప్పు తీసుకుని సకాలంలో చెల్లించలేదు.  

సదరు రైతు రూ.7,86,909లను చెల్లించాల్సి ఉండగా  బ్యాంక్​ ఆఫీసర్లు ఈ నెల20 న భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్‌‌డీసీసీబ్యాంక్​ అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​ భూపాల్​రెడ్డి, స్థానిక బ్యాక్​ మేనేజర్​ కుమారస్వామి,శెట్పల్లి సంగారెడ్డి విండో సీఈఓ శ్రీనివాస్,సిబ్బంది ఉన్నారు.