సుమారు రూ. 3 కోట్లు అవసరాలకు వాడుకున్న బ్యాంకు సిబ్బంది

V6 Velugu Posted on Sep 23, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్, అటెండర్ కలిసి బ్యాంకు డబ్బులను తమ అవసరాలకు వాడుకుంటున్నారు. గత రెండేళ్ల నుంచి 2 కోట్ల 91 లక్షలు వాడుకున్నట్లు తేలింది. బ్యాంక్ యాజమాన్యం ఆగస్టు నెలలో చేసిన ఆడిట్‎లో ఈ విషయం బయటపడింది. బ్యాంకు సీఈవో సాంబమూర్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి 44 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ చెప్పారు.

For More News..

అసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం

దారుణం.. 15 ఏళ్ల అమ్మాయిపై 29 మంది అత్యాచారం

సిరిసిల్ల మాఫియాకు అడ్డాగా మారుతోంది

Tagged Bhadradri Kothagudem, Bank fraud, Money Fraud, Bank staff, bank golmal

Latest Videos

Subscribe Now

More News