నవంబర్ 2025లో బ్యాంక్ హాలిడేస్: మొత్తం 11 రోజులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..!

నవంబర్ 2025లో బ్యాంక్ హాలిడేస్: మొత్తం 11 రోజులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..!

November 2025 Bank Holidays: ప్రతి నెల మాదిరిగానే భారత రిజర్వ్ బ్యాంక్ నవంబర్ 2025 నెలకు సంబంధించిన బ్యాంకు హాలిడేస్ లిస్ట్ ప్రకటించింది. ఈ నెలలో మొత్తంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు 11 రోజుల పాటు మూసివేయబడనున్నాయి. వీటిలో జాతీయ, ప్రాంతీయ పండుగలతో పాటు రెండవ-నాలుగవ శనివారాలు, అలాగే అన్ని ఆదివారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సెలవులు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయని గుర్తించాలి. 

నవంబర్ 2025 లో బ్యాంకు హాలిడేస్ ఫుల్ లిస్ట్:

  • నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు. అలాగే ఉత్తరాఖండ్ ప్రాంతంలో బుద్ధి దీపావళి వల్ల బ్యాంకులు కూడా మూసివేయబడతాయి.
  • నవంబర్ 2: ఆదివారం సెలవు
  • నవంబర్ 5: గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని బ్యాంకులు పనిచేయవు.
  • నవంబర్ 6: నోంగ్‌క్రెమ్ డ్యాన్స్ సందర్భంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు హాలిడే.
  • నవంబర్ 7: వంగల పండుగను పురస్కరించుకుని షిల్లాంగ్‌లో అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
  • నవంబర్ 8: రెండవ శనివారం సెలవు.
  • నవంబర్ 9: ఆదివారం సెలవు.
  • నవంబర్ 16: ఆదివారం సెలవు.
  • నవంబర్ 22: నాల్గవ శనివారం సెలవు.
  • నవంబర్ 23: ఆదివారం సెలవు.
  • నవంబర్ 30: ఆదివారం సెలవు.

ఈ సెలవుల కారణంగా బ్యాంక్ శాఖల వద్ద లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. వినియోగదారులు బ్యాంకింగ్ సేవలను పొందటంలో ఎలాంటి అంతరాయం ఉండదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ వంటి ప్రత్యామ్నాయాల ద్వారా కస్టమర్లు తమ బిల్లు చెల్లింపులు వంటి ప్రాధాన్యమైన సేవలను కొనసాగించవచ్చు. అలాగే NEFT, RTGS వంటి సిస్టమ్స్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. పైగా డబ్బు విత్‌డ్రా కోసం ఏటీఎంలు తెరిచే ఉంటాయి. డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఎప్పటిలాగే పనిచేస్తాయి. 

బ్యాంకు శాఖలకు వెళ్లే ముందు వినియోగదారులు తమ రాష్ట్రానికి సంబంధించిన సెలవులను ఒక్కసారి సరిచూసుకోవడం అవసరం. ముఖ్యంగా పెద్ద లావాదేవీలు లేదా లోన్ డాక్యుమెంట్స్, ప్రాసెసింగ్ సంబంధించిన పనులు ముందుగానే పూర్తి చేయడం మేలు. ఇందుకోసం అవసరమైతే మీకు సమీపంలోని ఏదైనా బ్యాంక్ శాఖను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.