ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయి..ఏయే లావాదేవీలు జరపొచ్చు..?

ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయి..ఏయే లావాదేవీలు జరపొచ్చు..?

చాలామందిలో ఓ డౌట్ ఉంది. ఇయర్ ఎండింగ్ కదా..మార్చి 31 ఆదివారం వచ్చింది.. మరి ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయా.. ఒకవేళ బ్యాంకులు పనిచేస్తే ఏయే లావాదేవీలు జరపొచ్చు వంటి సందేహాలు కలుగుతుంటాయి. అయితే అన్ని డౌట్లను క్లియర్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్బిఐ ప్రకారం.. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన అన్ని ప్రభుత్వ పరమైన లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఆదివారం (మార్చి 31న) అన్ని బ్యాంకులు, వాటి అన్ని బ్రాంచ్ లు పనిచేస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. 
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు, ఆర్బీఐ కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ లావాదేవీలు, ప్రభుత్వం బ్యాంకింగ్ నిర్వహిస్తున్న ఎంపిక చేయబడిన ఏజెన్సీ లబ్రాంచ్ లు మార్చి 30,31 ,2024 న పనివేళ్లలో తెరిచి ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ జాక్షన్లు కూడా చేసుకోవాచ్చు. 

మార్చి 30,31న జరిపే ఈ ట్రాన్స్ జక్షన్లు జరపొచ్చు.. 

NEFT, RTGS: మార్చి 31, 2024 నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(RTGS) సిస్టమ్ లను ఉపయోగించి లావాదేవీలు అర్థరాత్రి 12 గంటల వరకు జరపొచ్చు. 

చెక్ క్లియరెన్స్: ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన ఏవైనా చెక్కులను క్లియరింగ్ కోసం బ్యాంకుల్లో సమర్పించవచ్చు. ఈ ప్రత్యేక ప్రభుత్వ చెక్ క్లియరింగ్ సెషన్ లకోసం ఇన్ స్ట్రమెంట్ ప్రెజెంటేషన్, రిటర్న్ క్లియరింగ్ తేదీలు, సమయం త్వరలో ప్రకటిస్తారు. 

ఏజెన్సీ బ్యాంకుల ద్వారా జరిగే ప్రభుత్వ లావాదేవీలు : 

  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కోసం ఖర్చు చేసిన డబ్బు
  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ల చెల్లింపులు 
  • ప్రత్యేక డిపాజిట్ పథకం 1975
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం 1968
  • కిసాన వికాస్ పత్ర 2014, సుకన్య సమృద్ధి ఖాతా 
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS) 2004

రిలీఫ్ బాండ్లు, సేవింగ్స్ బాండ్లతో కూడిన లావాదేవీలు వంటి ఏజెన్సీ కమిషన్ కు అర్హత ఉన్న రిజర్వ్ బ్యాంక్ సూచించిన ఏజెన్సీ బ్యాంకు శాఖలు మాత్రమే మార్చి 31, 2024 ఆదివారం  లావాదేవీల కోసం తెరవబడి ఉంటాయి.